వరంగల్ మేత్రాసన పీఠాధిపతి


Sun,September 9, 2018 03:21 AM

-బిషప్ ఉడుమల బాల
కాజీపేట, సెప్టెంబర్ 08: ప్రతీ క్రైస్తవ తల్లి మరియమాత ను ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ మేత్రాసన పీఠాధిప తి బిషప్ డాక్టర్ ఉడుమల బాల సూచించారు. కాజీపేట పట్ట ణం 35వ డివిజన్ భవానీనగర్‌లోని వెలంకణి మాత చర్చి లో వెలంకణిమాత ఉత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం సాయత్రం జరిగింది. చర్చి విచారణ గురువు ఫాదర్ గాలి రాయపురెడ్డి ఆధ్వర్యంలో బిషప్ ఉడుమల బాల చర్చి లో బలిపూజ , ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం మరియమాత ఉత్సవ విగ్రహాన్ని క్రైస్తవులు రైల్వే కాలనీ, భవానీనగర్, డిజీల్‌కాలనీ చౌరస్తా మీదుగా దేవాలయం వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా బిషప్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. వెలంగణి మాత భక్తుల పాలిట వరమ న్నారు. మరియతల్లి భక్తుల కోరికలు తీర్చే మహనీయురాలు, ఆమె ఆశీస్సులను పొందాలన్నారు. సాయంత్రం క్రైస్తవులు కొవ్వొత్తులు, కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకున్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...