సీపీ ఎదుట న్యూడెమోక్రసీ దళ సభ్యుడు లొంగుబాటు


Sun,September 9, 2018 03:20 AM

నయీంనగర్, సెప్టెంబర్ 08: న్యూడెమోక్రసీ పార్టీ దళ సభ్యుడు సలందోస్ బియాందాస్ ఆలియాస్ ఆనంద్ 8ఎంఎం రైఫిల్‌తో పాటు 29రౌండ్ల బుల్లెట్లతో వరంగల్ కమిషనర్ విశ్వనాధ రవీందర్ ఎదుట శనివారం లొంగిపోయాడు. కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ దళ సభ్యుడి వివరాలను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా అటుకుపల్లి గ్రామానికి చెందిన బియాందాస్ అలియాస్ ఆనంద్ తన గ్రామంలో వ్యవసాయం చేసేవాడు. గత పది సంవత్సరాల క్రితం బియాందాస్‌కు గొర్రెలు, మేకల వ్యాపారం చేసే వరంగల్ రూరల్ జిల్లా పరకాల ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో బియాందాస్ కుటుంబ సభ్యులకు చెప్పకుండానే పరకాలకు వచ్చి మేకల కాపరిగా పని చేశాడు. అదే సమయంలో నర్సంపేటకు చెందిన న్యూడెమోక్రసీ లీగల్ ఆర్గనైజర్‌గా పని చేస్తున్న కోడి సోమన్నతో పరిచయం ఏర్పడింది.

అతని ద్వారా బియాందాస్ న్యూడెమోక్రసీ గోపన్న దళంలో సభ్యుడిగా పని చేశాడు. ఈకాలంలో పార్టీ బియాందాస్‌కు 8ఎంఎం ఆయుధం అందించింది. అనంతరం సూర్యం, పుల్లన్న, కృష్ణ, గణేష్ దళాలతో కలిసి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని జంగాలపల్లి, గంగారం, మర్రిగూడెం, కోమట్లగూడ, కామారవ్, మహదేవగూడెం, ప్రాంతాల్లో 10సంవత్సరాల పాటు చురుకుగా పనిచేశాడు. ఈపదేండ్ల కాలంలో చాలా మంది సభ్యులు అరెస్ట్ కావడం, లొంగిపోవడంతో పాటు పార్టీ విధానాలు నచ్చక తన వెంటనున్న 8ఎంఎంరైఫిల్, 29రౌండ్లను అప్పగించి లొంగిపోయినట్లు సీపీ పెర్కొన్నారు. తక్షణమే పునరావాసం కింద 5వేల రూపాయలను అందిస్తున్నామని, ప్రభుత్వం నుంచి తనకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని అన్నారు. జనజీవన స్రవంతిలో కలిసే వారికి పోలీసుల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆనంద్ లొంగుబాటుకు కృషి చేసిన కాజీపేట ట్రాఫిక్ సీఐ నర్సయ్య, అడిషనల్ క్రైం డీసీపీ, ట్రాఫిక్ కానిస్టెబుల్ రాఘవులను సీపీ అభినందించారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...