ముగిసిన లక్కాకులమ్మ జాతరోత్సవం


Sat,September 8, 2018 02:22 AM

భీమదేవరపల్లి: మండలంలోని గట్లనర్సింగాపూర్‌లో మూడురోజులుగా జరుగుతున్న లక్కాకులమ్మ జాతర శుక్రవారంతో ముగిసింది. జాతర చివరిరోజున భక్తులు భారీగా ఆలయానికి తరలివచారు. గుట్టపైన గుహలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సం తానం లేని మహిళలు వరాలు పట్టి తమ కోరికలు తీర్చమం టూ వేడుకున్నారు. మరోవైపు గుట్టపై ఉన్న గౌషేపాక్ దర్గా వద్ద భక్తులు ప్రార్థనలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ చైర్మన్ మండల రవి, వ్యవస్థాపక చైర్మన్ కుక్కముడి ప్రభుదాసు, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు.

నేడు లక్ష్మీనరసింహస్వామి జాతర
మండలంలోని రత్నగిరి గ్రామంలో నేడు లక్ష్మీనరసింహస్వామి జాతర నిర్వహించనున్నట్లు తాజా మాజీ సర్పంచ్ శివసారపు ఎల్లయ్య తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మడేలయ్య ఆలయ నిర్మాణానికి భూమిపూజ
కమలాపూర్ : మండలంలోని వంగపల్లి గ్రామంలో మడేలయ్య ఆలయ నిర్మాణానికి టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొలిపాక సాంబయ్య శుక్రవారం భూమిపూజ చేశారు. మడేలయ్య దేవాలయ నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్ సీడీఎఫ్ నిధుల నుంచి రూ.5లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు దేవరాజు ముత్తయ్య, కోవరాజు వీరయ్య, విద్యాకమిటీ చైర్మన్ చిలువేరు రామస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు రమేశ్‌రెడ్డి, అశోక్, రాములు, ఓదెలు, ఎల్కటి కృష్ణ, దేవరాజు సాంబయ్య, రాజకొంరయ్య తదితరులున్నారు.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...