నాడు నీళ్లడిగితే జైలుకు..నేడు నీళ్లివ్వకుంటే జైలు


Sun,December 8, 2019 05:06 AM

-అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-ప్రాజెక్టుల నిర్మాణంతో సస్యశామలం
-భవిష్యత్ అంతా రైతు ఉత్పత్తి సంఘాలదే..
-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్
-దుగ్గొండిలో రైతులకు పట్టా పాస్ పంపిణీ
దుగ్గొండి, డిసెంబర్ 07 : గత ప్రభుత్వాల పాలనలో వారిన భూములకు నీళ్లు ఇవ్వాలని అడిగితే అన్నదాతలను జైలుకు పంపించిన చరిత్ర ఉందని, అదే టీఆర్ ప్రభుత్వంలో రైతులకు నీళ్లివ్వకపోతే అధికారులనే జైలుకు పంపిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తహసీల్దార్ నాయిని జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎ మ్మెల్యే పెద్ది సుదర్శన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో దగా పడిన వ్యవసాయాన్ని గాడిలో పెట్టి అన్నదాతలకు అం డగా నిలబడడానికి సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ పాటు, రైతుబందు, బీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. భూములన్నీ సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నా రు. భూగర్భ జలాలలను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దు గ్గొండి, నెక్కొండ మండలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.

అర్హులైనా రైతులందరికీ పట్టాలు అందిస్తామన్నారు. భవిష్యత్ అంతా రైతు ఉత్పత్తిదారుల సం ఘాలదేన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో యాంత్రిక పరికరాలను వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసుకుని వాటిని బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీ మొత్తం రైతు ఉత్పత్తి సంఘాలకే ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. రైతులకు రెండు పం టలకు సాగు నీరందించేందుకు డీబీఎం 30 ద్వారా దుగ్గొండిలోని 29 చెరువులను నింపడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేసి రెండు మూడు రోజు ల్లో డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, సర్పంచ్ తోకల మంజుల, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్ రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తోకల నర్సింహరెడ్డి, ఎంపీటీసీ మోర్తాల రాజు, బీరం సంజీవరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్ ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...