మేడారం తరహాలో అగ్రంపహాడ్ జాతర


Sat,December 7, 2019 02:52 AM

-సమన్వయంతో పనిచేయాలి
-మేడారం తరహాలో శాశ్వత పనులు
-ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-జాతర ఏర్పాట్లపై కలెక్టర్ , అధికారులతో సమీక్ష
-అమ్మవార్ల సన్నిధిలో ఏడు గ్రామాలకు ట్రాక్టర్ల పంపిణీ

ఆత్మకూరు, డిసెంబర్ 06 : రాష్ట్రంలోని రెండో జాతరగా పేరొందిన అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మేడారం తరహాలో జరిగేలా చూడాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత కోరారు. శుక్రవారం మం డలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ దేవతలను కలెక్టర్ హరిత దర్శించుకోని కొబ్బరి కాయలు కొట్టి, మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ శాఖాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. మొదటగా విద్యుత్ సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ఏఈ రవికుమార్ అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రాంగణంలో మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే, సమస్య తీరి పోతుందని ఏఈ వివరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈ జాతరకు రూ.31లక్షల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరైనట్లు తెలిపారు.

భక్తులకు తాగు నీరు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దీంతో జాతర నాలుగు వైపులా శాశ్వతంగా ఉండేందుకు ప్రభుత్వ భూమి ఉంటే మరుగుదొడ్లు నిర్మించాలన్నా రు. పీఆర్‌డీఈ లింగారెడ్డి మాట్లాడుతూ జాతరలో కమ్యూనిటీ హాల్ కోసం రూ.5లక్షల నిధులు కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత జాతరలో పారిశుధ్యపనుల కోసం పంచాయతీ సిబ్బందితో పాటు, తాత్కాలికంగా 120 మంది సిబ్బందిని నియమించామని ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. డీఎంహెచ్‌వో మధుసూదన్ మాట్లాడుతూ జాతరలో భక్తు ల కోసం 108 అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ ప్రతి పనికి టెండర్లు వేస్తే జాతర ఆదాయం పెరుగుతుందన్నారు. జాతర ప్రాముఖ్యత పెంచేందుకు, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆర్డీవో ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. పోలీసులు జాతరకు పార్కింగ్ స్థలాలు చేసుకోవాలని ఏసీపీ శ్రీనివాస్‌ను కోరారు.

అంగరంగ వైభవంగా నిర్వహించాలి
మేడారం తరహాలో జరుగుతున్న అగ్రంపహాడ్ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జాతరలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జాతర ప్రా ముఖ్యత పెరగాలంటే, పెద్ద జాతరకు వెళ్లే భక్తులు అగ్రంపహాడ్ మీదుగా వెళ్లేలా బస్సు రూట్ల ప్రణాళిక తయారు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. గత ఏడాది మిగిలిన రూ.5లక్షల ఆదాయంతో ఎకరం స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎండోమెంట్ అధికారులు భక్తుల కోసం క్యూలైన్ల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పరిసర గ్రా మాల ప్రజల సహకారంతో జాతరను విజయవంతం చేయాలన్నారు.

పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ
పచ్చదనం పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ్ర హరిత, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేతుల మీదగా సర్పంచ్‌లకు అందజేశారు. అగ్రంపహాడ్ సమ్మక్క సా రలమ్మ ప్రాగంణంలో ఏడు గ్రామాల కు చెందిన సర్పంచ్‌లకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు మంచి గుర్తింపు నిచ్చిందన్నారు. ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో కిషన్, డీఆర్‌డీవో సంపత్‌రావు, ఎండోమెంట్ కమిషనర్ సునీత, ఏసీపీ శ్రీనివాస్, ఎంపీపీ మార్క సుమలత, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్ ముంతా జ్, ఎంపీవో చేతన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, మార్కెట్ చైర్మెన్ కాంతాల కేశవరెడ్డి, కుడా డైరెక్టర్ రవీందర్, వరంగల్ మార్కెట్ మాజీ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజు, సర్పంచ్‌లు మాదాసి అన్నపూర్ణ, ఎనకతళ్ల విజయహాంసాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, బొల్లెబోయిన రవియాదవ్, కత్తెరశాల రాణిమల్లేశం, సీఐలు రంజిత్‌కుమార్, వెంకటేశర్లు, జాతర పూజారులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...