ప్రతి ఎకరాకూ సాగునీరు..


Sat,December 7, 2019 02:50 AM

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. దుగ్గొండి, చెన్నారావుపేట మండలంలో కెనాల్ తొవ్వకానికి వెంటనే అధికారులు సర్వేలు చేసి మార్కింగ్ ఇవ్వాలని సూచించారు. భూములు కోల్పోతున్న రైతులకు అధిక మొత్తంలో నష్ట పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుతో గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతామన్నారు. అధికారులు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాల న్నారు. కాగా, హలో బీసీ చలో ఢిల్లీ పోస్టర్‌ను పరకాల ఎమ్మెల్యే చల్లా దర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమం లో ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, జెడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఆర్డీవో మహేందర్‌జీ, జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, డీఈ రామకృష్ణ, కుడా డైరెక్టర్ వీరగోని రాజుకుమార్, తహసీల్దార్లు కనకయ్య, జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు పూండ్రు జైపాల్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, మల్లారెడ్డి, ప్రకాశ్, ఎంపీటీసీ వీరరావు, నాయకులు రాజేశ్వర్‌రావు, చిన్ని, రాజేశ్వర్‌రావు, సంపత్, వెంకటేశ్వర్లు, బాలరాజు, ధనుంజేయ్, అశోక్, డుక్రె రమేశ్, డోలి రమేశ్, కుమారస్వామి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...