కోనాయిమాకుల ప్రాజెక్టుతో సస్యశ్యామలం


Sat,December 7, 2019 02:49 AM

గీసుగొండ, డిసెంబర్ 06 : కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో జిల్లాలోని మూడు మండలాల్లో 14,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌పై నిర్మిస్తున్న కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న కెనాల్ పనులు, పంపుహౌస్ పనులను శుక్రవారం వారు పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చాల్లా మాట్లాడుతూ కోనాయిమాకుల లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టులో మిగిలిన పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కెనాల్ ద్వారా చెరువులను నింపడంతో సుమారుగా 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. అధికారులు ఆ దిశగా ప్రణాళికలను తయారు చేసుకొని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ ప్రాజక్టు పూర్తయితే రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు.

చెరువులను నింపే కాల్వలకు అధికారులు వెంటనే మ్యాప్‌ను తమారు చేసి మార్కింగ్ ఇవ్వాలన్నారు. పరకాల నియోజవర్గంలో గీసుగొండ 7400, సం గెం మండలంలోని 2200, దుగ్గొండి మండలంలో 4500, చెన్నారావుపేట మండలంలో 400 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి, పనులు చేయకుండానే రూ.3.20 కోట్ల బిల్లులు తీసుకున్నట్లు ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాజక్టును రీడిజైన్ చేసి బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం రూ.43 కోట్లతో వ్యయంతోనే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అన్ని చెరువులకు నీళ్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...