శుద్ధ జలాలనే తాగాలి : ఈఈ


Sat,December 7, 2019 02:49 AM

పరకాల, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న శుద్ధ జలాలనే తాగాలని మిషన్ భగీరథ ఎస్‌ఈ రాములు, ఈఈ మాణిక్యరావు అన్నారు. శుక్రవారం దామెర మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో నియోజకవర్గంలోని ఆత్మకూరు, భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బోరు, మినరల్ వాటర్, మిషన్ భగీరథ నీటిని టెస్ట్ చేసి చూపించారు. మిషన్ భగీరథ ప్లాంట్ ద్వారా శుద్ధిచేసిన నీటినే అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిలో మనిషి శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు ఉన్నాయన్నారు. మినరల్ వాటర్ కన్నా ఈ నీరే మంచివన్నారు. ముందుగా ప్రజాప్రతినిధులు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించి, నీటి శుద్ధి గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఎంపీపీ మార్క సుమలత, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...