మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్


Sat,December 7, 2019 02:49 AM

-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, నమస్తేతెలంగాణ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకుంటున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట ఆర్టీసీ కార్మికుడు ఎండీ యాకూబ్‌పాషా సమ్మెకాలంలో మృతి చెందగా ఆ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటుతో నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న చెన్నారావుపేట మండలం ఉప్పరపెల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ఎండీ యాకూబ్‌పాషా మృతి చెందాడని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ సమ్మెకాలంలో మృతి చెందిన కార్మికులకు ఆదుకుంటామని ఇప్పటికే హామీ ఇచ్చారన్నారు. దీనిలో భాగంగానే ఎండీ యాకూబ్ పాషా కుమారుడు ఎండీ ఫయాజ్‌కు ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపారు. అతడిని డిపోలో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ.2 లక్షల చెక్కుతో పాటు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా ఫయాజ్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్, కార్మికులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...