పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు : అరూరి


Fri,December 6, 2019 02:35 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 05 : పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా టీఆర్‌ఎస్‌లో గుర్తింపు లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌ విభాగం వర్ధన్నపేట మండల అధ్యక్షుడు రాజేందర్‌రాథోడ్‌, కమిటీ బాధ్యులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు పార్టీ గ్రామ కమిటీతోపాటు మండల కమిటీ, అనుబంధ సంఘాల కమిటీలను కూడా నియమించినట్లు చెప్పారు. మండల కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన అనుబంధ సంఘాల కమిటీలు, గ్రామ కమిటీ బాధ్యులతో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేసేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా చూసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు, వారి కుటుంబాలకు కూడా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నేతృత్వంలో కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ రాష్ట్ర కమిటీ విశేషంగా పనిచేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ భిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి ఇల్లందుల సుదర్శన్‌, పార్టీ నాయకులు తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, కస్తూరి అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...