పది మంది జెడ్పీ సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు


Fri,December 6, 2019 02:35 AM

సుబేదారి, డిసెంబర్‌ 05 : పంచాయతీరాజ్‌ శాఖ ఉమ్మడి జిల్లా పరిషత్‌లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పదిమందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారికి వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌ గురువారం జెడ్పీలోని తన చాంబర్‌లో పదోన్నతి ఆర్టర్‌ కాపీలను అందజేశారు. కాగా, పదోన్నతి పొందిన ఈ పది మందిని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆరు జిల్లాలకు కేటాయించారు. ఈ మేరకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు సునీల్‌కుమార్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాకు వెంకటేశ్వర్‌రెడ్డి, శైలశ్రీ, రాఘవులు, ఎండీ అంజద్‌, మహబూబాబాద్‌ జిల్లాకు వీ సంద్యారాణి, కే శ్రీనివాస్‌, జనగాం జిల్లాకు జీ శ్రీనివాస్‌, ఏ దేవేందర్‌రెడ్డి, ములుగు జిల్లాకు జీ రూపేష్‌విజయచందర్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...