కొనుగోల్‌ మాల్‌


Thu,December 5, 2019 04:47 AM

-పల్లెల ప్రగతికి నడుం బిగించిన ప్రభుత్వం
-పంచాయత ట్రాక్టర్‌ కొనేందుకు నిర్ణయం
-ట్రాక్టర్ల కొనుగోలుకు జిల్లాస్థాయి పర్చేజ్‌ కమిటీ
-రేట్లపై కొటేషన్లు సేకరించి కంపెనీలతో నెగోషియేషన్‌
-రెండు విడతల్లో 13 కంపెనీల ట్రాక్టర్ల రేటు ఫిక్స్‌
-సర్పంచ్‌లకు కంపెనీల ఆఫర్స్‌... రేట్లపై సందేహాలు
-ఇతర జిల్లాల ధరలు తక్కువ.. నిజమేనన్న డీపీవో

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి - నమస్తే తెలంగాణ : జిల్లా అధికార యంత్రాంగం పనితీరు విమర్శలకు తావిస్తున్నది. పా లనాపరమైన నిర్ణయాల్లో మార్గదర్శకులుగా నిలవాల్సిన ఉన్న తాధికారులు కొందరు అనుమానాలు రేకెత్తించే రీతిలో వ్యవహ రిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించడంలో అయోమ యం సృష్టిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కావడానికి దోహదపడుతున్నారు. తాజాగా పంచాయతీలు కొనుగోలు చేసే ట్రాక్టర్ల ధర నిర్ణయించడంలో ఇదే జరిగింది. గోల్‌మాల్‌కు దారి తీసింది. జిల్లాలో పంచాయతీలు కొనే ట్రాక్టర్ల ధరల కంటే ఇతర జిల్లాల్లో పంచాయతీలు కొనుగోలు చేసే ట్రాక్టర్ల ధరలు తక్కు వగా ఉండడం చర్చనీయమైంది. ఈ విషయం తెలియగానే జిల్లా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మరోసారి ట్రాక్టర్ల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఇతర జిల్లాల్లో ఖరా రైన ధరలను అమల్లోకి తెచ్చే దిశలో అడుగులు వేస్తున్నారు.

అ యితే ఇప్పటికే జిల్లాలో పంచాయతీలకు 65 ట్రాక్టర్ల కొనుగోలు జరిగినట్లు తెలిసింది. పల్లెల ప్రగతికి నడుం కట్టిన తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం- పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీకో ట్రాక్టర్‌ కొనుగోలుకు నిర్ణయించింది. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలింపు, మొక్కలకు నీరు పోయడానికి, ఇతర పనులకు ట్రాక్టర్‌ అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీ నిధులతో గ్రామ పంచాయతీకో ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదే శించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ప్రతి జిల్లాలో పంచాయతీలకు ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ కొ నుగోలు కోసం జిల్లాస్థాయి పర్చేజ్‌ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌, డీఆర్డీవో, డీఈవో, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌, ఉద్యాన అధికారి, పరిశ్రమల శా ఖ అధికారి సభ్యులు, జిల్లా పంచాయతీ అ ధికారి మెంబర్‌ కన్వీనర్‌గా ఉన్నారు. జిల్లా లో పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు కో సం ధరలు నిర్ణయించేందుకు ఇటీవల జిల్లా
పర్చేజ్‌ కమిటీ మొదట వివిధ ట్రాక్టర్‌ కం పెనీల నుంచి కొటేషన్లు తెప్పించింది.
ఆ తర్వాత సదరు కంపెనీల ప్రతి నిధులతో స మావేశమై నెగోషియేషన్‌ జరిపింది. చివరకు కొటేషన్‌ ధరలపై కొంత రేటు తగ్గించిన ట్రాక్టర్ల కంపెనీలను ఆరింటిని ఎంపిక చేసిం ది. ఈ మేరకు రేటు తగ్గించి అమ్మేందుకు ముందుకొచ్చిన ఈ ఆరు కంపెనీల ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని, వీటిని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేయొద్దని జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సర్క్యులర్‌ అందింది. దీనిపై పలు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు అభ్యంతరం వెలిబుచ్చారు.

మరో ఏడు కంపెనీల ఎంపిక..
తొలి విడత ఎంపిక చేసిన ఆరు కంపెనీల ట్రాక్టర్ల రేట్లపై అభ్యంతరాలొస్తున్న తరుణంలో జిల్లా స్థాయి పర్చేజ్‌ కమిటీ మరి కొన్ని కంపెనీల నుంచి ట్రాక్టర్ల రేట్లపై కొటేషన్లు తెప్పించింది. పరిశీలించిన తర్వాత సదరు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ట్రాక్టర్ల రేట్లపై నెగోషియేషన్‌ నిర్వహించింది. కొటేషన్‌ రేట్ల కంటే తగ్గించి తమ కంపెనీ ట్రాక్టర్లు విక్రయించేందుకు ముందుకొచ్చిన కంపెనీల్లో రెండో విడుత ఏడు కంపెనీలను ఎంపిక చేసింది. ఈ కంపెనీల ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేయవచ్చని కొద్ది రోజుల క్రితం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు మరో సర్క్యులర్‌ చేరింది. రెండు విడతల్లో ఎంపిక చేసిన మొత్తం 13 కంపెనీల ట్రాక్టర్లు జిల్లా స్థాయి పర్చేజ్‌ కమిటీ నిర్ణయించిన రేట్లకు కొనుగోలు చేయవచ్చని, ఇదే ట్రాక్టర్లను ఈ రేట్ల కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు
చేయరాదని సర్క్యులర్‌లో ఉంది.
జిల్లా స్థాయి పర్చేజ్‌ కమిటీ పంచాయతీలకు కొనడానికి నిర్ణయించిన పదమూడు కంపెనీల ట్రాక్టర్లలో 21, 22, 24, 25, 27, 28, 30, 32, 35, 37, 39, 4042, 45 హెచ్‌పీలవి ఉన్నట్లు తెలిసింది. నెగోషియేషన్‌ తర్వాత ఖరారైన వివిధ మోడళ్లు గల ఈ ట్రాక్టర్ల రేట్లతో గ్రామ పంచాయతీలకు సర్క్యులర్‌ చేరింది. నిధులు పుష్కలంగా ఉన్న పంచాయతీల్లో సర్క్యులర్‌ అందగానే జిల్లా స్థాయి పర్చేజ్‌ కమిటీ ఎంపిక చేసిన కంపెనీల ట్రాక్టర్లు కొనుగోలు చేయడం ప్రారంభమైంది. జిల్లాలో 401 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటి వరకు 65 పంచాయతీల్లో ట్రాక్టర్ల కొనుగోలు జరిగింది. ఈ ట్రాక్టర్లు కొన్న ప్రతి పంచాయతీ పరిధిలో 1,500కు పైగా జనాభా ఉన్నట్లు సమాచారం.
1,500లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో ట్రాలీ, మినీ ట్రాక్టర్‌ కొనుగోలు చేస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే 1,000 నుంచి 1,500లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు పలువురు మినీ ట్రాక్టర్‌, ట్రాలీ వంటిది కాకుండా తమకూ ట్రాక్టర్‌ అవసరమని పేర్కొంటున్నారు. జనాభా పెరగనున్నందున తమ ప్రతిపాదన పరిగణనలోకి తీసుకుని ట్రాక్టర్‌ కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి జిల్లాలో ఇంకా 336 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలు జరగాల్సి ఉంది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...