రైతుల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు


Thu,December 5, 2019 04:41 AM

-జిల్లాలో 103 సెంటర్లు ఏర్పాటు
-వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : రైతులకు లాభం చేకూర్చడం కోసమే ప్రభు త్వం విరివిగా ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఆరెల్లి స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించడం వల్ల గిట్టుబాటు ధర రాకపోగా చెల్లింపుల విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఈ మేరకు ప్రతి గ్రామంలో సీఎం కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే జిల్లాలో సుమారు 103 కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు.

రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి రూ.1,835 మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఏమాత్రం ఇబ్బందులకు గురికాకుండా అధికారులు, నిర్వాహకులు ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు జరిగినా సహించేదిలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్‌ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, అర్బన్‌ జెడ్పీ వైస్‌చైర్మన్‌ శ్రీరాములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీటీసీ సీనపల్లి రజిత, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...