ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి


Thu,December 5, 2019 04:40 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని నర్సంపేట ఏసీపీ ఫణీందర్‌ అన్నారు. బుధవారం నర్సంపేట బాలుర ఉన్నత పాఠశాలలో ఏఎస్‌ఆర్‌ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వాడంతో వచ్చే అనార్థాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏసీపీ మాట్లాడుతూ .. మానవులు రోజు వారి పనుల్లో ప్లాస్టిక్‌ను వాడుతూ గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నారని తెలిపారు. వీటికి బదులుగా ప్రకృతి సహజ సిద్ధమైన విస్తారాకులు, జనపనార సంచులు, పేపర్‌గ్లాస్‌లు, ప్లేట్సు మొదలైన వాటిని వాడాలని కోరారు.

అదే విధంగా గృహాలలో గాజు గ్లాసులు, స్టీలు పాత్రలు, మట్టిపాత్రలు, వాడి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌తో పర్యావరణం దెబ్బ తింటుందని అన్నారు. మానవుడికి నష్టం చేసే ప్లాస్టిక్‌ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సీఐ కరుణసాగర్‌రెడ్డి, ఏఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్‌, బాలుర ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సురేశ్‌, విద్యా కమిటీ చైర్మన్‌ సాంబయ్య, కుసుమ భద్రయ్య, ఏఎస్‌ఆర్‌ సభ్యులు డోలి కార్తీక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...