‘బెల్ట్’ వేలం కలకలం!


Wed,December 4, 2019 03:16 AM

-పోలీస్, ఎకై్సజ్ శాఖ అధికారుల ఆరా
-బహిరంగ వేలంపై సమాచార సేకరణ
-సింగరాజుపల్లి, కోగిల్వాయి గ్రామాల సందర్శన
-పరకాల ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్ విచారణ
-‘నమస్తే తెలంగాణ’ ఎఫెక్ట్
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : బెల్ట్ షాపుల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించడంపై ఎకై్సజ్, పోలీసు శాఖ అధికారులు విచారణ చేపట్టారు. రెండు గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజావూపతినిధులు, బెల్ట్ షాపుల నిర్వాహకులను కలిసి సమాచారం సేకరించారు. ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించిందెవరు?, వేలంలో పాల్గొన్న వ్యాపారుపూవరు?, బహిరంగ వేలం ద్వారా బెల్ట్ షాపులు దక్కించుకున్న వ్యక్తుపూవరు? అనేది స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దామెర మండలంలోని రెండు గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ కోసం గ్రామ పెద్దలు బహిరంగ వేలం నిర్వహించడం, వ్యాపారులు కొందరు వేలంలో పాల్గొని గ్రామానికి డబ్బు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంపై మంగళవారం ‘బెల్ట్ షాపులకు వేలం!’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనం ఎకై్సజ్, పోలీసు శాఖలో కలకలం రేపింది. జిల్లాలో దీనిపై హాట్ టాపిక్ నడిచింది. బెల్ట్‌షాపుల నిర్వహణకు బహిరంగ వేలం జరగడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఈ వ్యవహారంపై ఆరా తీశారు. దీంతో స్థానిక పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

బెల్ట్‌షాపుల కోసం బహిరంగ వేలం జరిగినట్లు తెలుసుకుని దామెర మండలంలోని సింగరాజుపల్లి, కోగిల్వాయి స్థానిక ప్రజావూపతినిధులు, బెల్ట్ షాపుల నిర్వాహకులతో పోలీసు అధికారులు మాట్లాడారు. జరిగిందేమిటనేది తెలుసుకుని తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎకై్సజ్‌శాఖ పరకాల ఇన్‌స్పెక్టర్ జగన్నాథరావు తమ సిబ్బందితో సింగరాజుపల్లి, కోగిల్వాయి గ్రామాలను సందర్శించారు. బెల్ట్ షాపుల నిర్వహణ కోసం బహిరంగ వేలం జరిగిందా? అనేది ఆయా గ్రామాల్లోని బెల్ట్ షాపుల నిర్వాహకులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై తనకు ఇంకా పరకాల ఇన్‌స్పెక్టర్ నుంచి విచారణ నివేదిక అందలేదని ఎకై్సజ్‌శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు చెప్పారు. పోలీసు అధికారులు మాత్రం సింగరాజుపల్లి, కోగిల్వాయి గ్రామాల్లో బెల్ట్‌షాపుల కోసం వేలం జరిగిందని, వేలంలో పాల్గొన్నదెవరు, డబ్బు చెల్లించి బెల్ట్ షాపు నిర్వహించుకుంటుందెవరు అనే వివరాలను సేకరించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసుశాఖలోని ఇంలెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది కూడా బెల్ట్ షాపుల కోసం బహిరంగ వేలం నిర్వహించడంపై తమ నెట్‌వర్క్ ద్వారా సమాచారం సేకరించి నివేదిక రూపొందించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో బెల్ట్ షాపుల నిర్వాహకుల్లో గుబులు మొదలైంది. బహిరంగ వేలం నిర్వహణపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...