సామాజిక రుగ్మతలపై అవగాహన పెంచుకోవాలి


Wed,December 4, 2019 03:14 AM

ఖానాపురం : సామాజిక రుగ్మతలపై ప్రతి ఒ క్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీవో) మహేందర్‌డ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం బుధరావుపేట మోడల్‌పా జిల్లా బాలల సంరక్షణాధికారి ఆధ్వర్యంలో బాల్యానికి భరోసాపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీవో మా ట్లాడుతూ.. బాల్యవివాహాలు, అక్రమ ర వాణా, సోషల్ మీడియా ప్రభావం ,కెరీర్‌పై అశ్రద్ధ్ద్ద, లైంగిక వేధింపులు, కౌమార దశలో వచ్చే శారీరక మార్పులను బాలలు ఎదుర్కొంటున్నారని అన్నారు . బాలలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మంచి, చెడు స్పర్శ, వ్యక్తిగత పరిశువూభతపై లఘు చిత్రం ద్వారా చూపించారు. బాలికలు అనుకోని ప్రమాదాలకు గురైతే 1098 చైల్డ్‌లైన్ ఫోన్ చేసి రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్షికమంలో ప్రొటెక్షన్ అధికారి రాజు, వైధ్యాధికారి విపిన్‌కుమార్,ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సధాకర్‌డ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...