భారమైనా భరిస్తున్నాం..


Tue,December 3, 2019 03:04 AM

-అప్పులు తెచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తున్నాం
-రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌
-ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో
-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నెక్కొండ, డిసెంబర్‌ 02 : ఆర్థికంగా అధిక భారమైనా రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ తపిస్తున్నారని, అప్పులు తెచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, వాగ్యానాయక్‌ తండ, గొల్లపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. రెడ్లవాడలో కలెక్టర్‌ హరితతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోనే గరిష్ట మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాల దళారులు ఇక్కడి ధాన్యం తరలించి సొమ్ము చేసుకునే అవకాశం ఉందన్నారు. మన నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడాలని అధికారులకు, రైతులకు సూచించారు. కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ రైతుల చెంతన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వసతులు మెరుగుపరిచామని తెలిపారు. దాన్యం దిగుబడి ఈసారి బాగా పెరిగిందన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచామని వివరించారు. నెక్కొండ మండలంలోనే 9 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌, వైస్‌ ఎంపీపీ పుండరీకం, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ, జెడ్పీటీసీ లావుడ్య సరిత హరికిషన్‌, సొసైటీ చైర్మన్లు ఆవుల చంద్రయ్య, కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో అడిదెల సంపత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, మండల నాయకులు జలగం సంపత్‌రావు, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, సర్పంచ్‌ రావుల శ్రీలతప్రసాద్‌, సర్పంచ్‌ హరికిషన్‌, మారం రాము పాల్గొన్నారు. అలాగే మండలంలోని నెక్కొండ, గొల్లపల్లి గ్రామాల్లో చెత్తబుట్టలను ఎమ్మెల్యే, కలెక్టర్‌ పంపిణీ చేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...