లక్ష్యాలకనుగుణంగా రుణాలు అందించాలి


Tue,December 3, 2019 03:02 AM

పరకాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు బ్యాంకులు లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలని కలెక్టర్‌ ఎం హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ బ్యాంకుల అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌ అధికారులతో రుణాల పంపిణీపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకుల అధికారులు పది రోజుల్లో లబ్ధిదారులకు రుణాలు అందేలా చొరవ చూపాలన్నారు. రుణాలు అందించడంలో పురగతిలేని బ్యాంకు అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ 2017-18 సంవత్సరానికిగానూ యూసీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పురోగతిపై దృష్టిసారించాలని ఆదేశించారు. బీసీ, మైనార్టీ, క్రిస్టియన్‌ లబ్ధిదారులకు రుణాలను అందించాలని, పీఎంఈజీపీలో కేవీఐబీ, కేవీఐసీ, డీఐసీలకు సంబంధించిన లబ్ధిదారుల దరఖాస్తుల వివరాల గురించి తెలుసుకున్నారు. డీఆర్డీవోకు సంబంధించిన సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ రుణాలు, 30 రోజుల గ్రామ ప్రణాళికలో పంచాయతీలకు ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో వెనకబడ్డాయన్నారు. అధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ, కెనరాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులు రుణాల మంజూరులో ముందంజలో ఉన్నాయన్నారు. ఆయా బ్యాంకు అధికారుల పనితీరును ప్రశంసించారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు అధికారి సత్యజిత్‌, డీఆర్డీవో సంపత్‌రావు, డీఐసీ జీఎం నర్సింహమూర్తి, గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి జనార్దన్‌, బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి నర్సింహస్వామి, సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి సురేశ్‌, బ్యాంకుల కంట్రోలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కొత్త పంచాయతీల్లో డంప్‌యార్డులు, శ్మశానవాటికలకు ఆమోదం
నూతనంగా ఏర్పడిన గిరిజన పంచాయతీల్లో డంప్‌యార్డులు, శ్మశానవాటికల ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గిరిజన పంచాయతీల్లో డంప్‌యార్డులు, శ్మశాన వాటికల కోసం సముదాయక హక్కుల కల్పన కోసం కలెక్టర్‌ హరిత అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నూతనంగా ఏర్పడిన 18 గ్రామాల నుంచి డంప్‌యార్డులు, శ్మశాన వాటికల కోసం ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఇందులో నాలుగు గ్రామాలు రెవెన్యూ పరిధిలోకి రాగా, ఆరు గ్రామాలు మహబూబాబాద్‌ జిల్లా అటవీ భూముల్లోకి వెళ్లాయన్నారు. గోవిందాపురం, అశోక్‌నగర్‌, చిలకమ్మతండా, బండమీద మామిడితండా, ఆసరవెళ్లి, మనుబోతులగడ్డ, బోటిమీద తండా, మూడు చెక్కల పాలెం ఎనిమిది గ్రామాల్లో అటవీ హక్కుల చట్ట ప్రకారం అటవీ హక్కుదారులకు సముదాయక హక్కులు కల్పించే క్రమంలో డంప్‌యార్డులు, శ్మశాన వాటికలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. సమావేశంలో డీఎఫ్‌వోపురుషోత్తం, కమిటీ సభ్యుడు, పర్వతగిరి జెడ్పీటీసీ సింగ్‌లాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...