ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం


Mon,December 2, 2019 02:42 AM

-ప్రజల్లో చైతన్యం రావాలి
-వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
-జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవ ర్యాలీలు

నర్సంపేట, నమస్తేతెలంగాణ : ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నర్సంపేట ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా రోగం వస్తే మందులకు తగ్గుతుందన్నారు. కానీ, ఎయిడ్స్‌ లాంటి ప్ర మాదకర జబ్బు సోకితే తగ్గుముఖం ప ట్టే సమస్యే లేదని పేర్కొన్నారు. ఎయిడ్స్‌ వ్యాధికి మందులు లేవన్నారు. ఒకసారి ఈ వ్యాధి వచ్చిందంటే జీవితాంతం ఉంటుందన్నారు. ఇలాంటి ప్రమాదకర జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీ వైరస్‌తో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక వ్యాధులు వస్తాయన్నారు. రక్షణ లేని లైంగిక చర్యల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. అలాగే, ఎయిడ్స్‌ వచ్చిన రోగి వాడిన సూదులు, బ్లేడ్‌లతో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజీల వల్ల వస్తుందన్నారు. ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలని కోరా రు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు.

సాధారణంగా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వా త ఆరు నెలల వరకు రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధి జాడ కనుగొనలేమన్నారు. జ్వరం, నోటి పూత, చర్మవ్యాధులు, నీరసం, నీళ్లవీరేచనాలు, ఆకలి తగ్గిపోవడం, అలసట, పదిశాతం బరువును కోల్పోవడం, గొంతు కిందగా గ్రంథుల వాపు ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు. హెచ్‌ఐవీ వైరస్‌ చాలా నెమ్మదిగా శరీరంలోకి వ్యాపిస్తుందన్నారు. హెచ్‌ఐవీ వైరస్‌ ఎయిడ్స్‌ దశ కు చేరుకోవడానికి పది సంవత్సరాలు పడుతుందన్నారు. కొందరిలో అంతకంటే ఎక్కువ కూడా పడుతుందన్నారు. మరికొందరిలో పదేళ్ల తర్వాత కూడా లక్షణాలు కనపడకపోవచ్చన్నారు. అం దువల్ల అందరూ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సరైన సమయంలో ఏఆర్‌టీ మందులు వాడ డం మొదలు పెడితే జీవితకాలాన్ని 20 నుంచి 30 ఏళ్ల వరకు పొడిగించవచ్చన్నారు. ప్రతీ సంవత్సరం కొత్త మం దులు అందుబాటులోకి రావడం వల్ల రోగుల జీవితకాలం పెరుగుతోంద న్నా రు. అందరూ దీనిపై ప్రచారం ముమ్మరంగా చేసి వ్యాధి అంతానికి పాటు పడాలని కోరారు. కాగా, ర్యాలీలో కళాకారు ల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో మధుసూదన్‌, నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...