గవర్నర్‌ దత్తాత్రేయను సన్మానించిన డిస్నీల్యాండ్‌ స్కూల్‌ యాజమాన్యం


Mon,December 2, 2019 02:40 AM

దామెర, డిసెంబర్‌ 01 : హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను దామెర మండలం ఒగ్లాపూర్‌ శివారులోని డిస్నీల్యాండ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ యాజమాన్యం ఆదివారం ఘనంగా సన్మానించింది. వరంగల్‌లో నిర్వహించిన గోకుల్‌(గొల్లకురుమ లెజెండ్స్‌)సభలో పాల్గొనేందుకు తొలిసారిగా వచ్చిన దత్తాత్రేయను స్కూల్‌ కరస్పాండెంట్‌ బాలుగు శోభారాణి, డైరెక్టర్లు దయ్యాల రాకేశ్‌భాను, దయ్యాల దినేశ్‌చందర్‌, సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాస్‌ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. గవర్నర్‌ దత్తాత్రేయ స్వయంగా డిస్నీల్యాండ్‌ స్కూల్‌ యాజమాన్యానికి బంధువు. గవర్నర్‌గా ఉన్నత స్థాయికి ఎదిగిన దత్తాత్రేయ సమాజానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని స్కూల్‌ యాజమాన్యం పేర్కొంది.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...