శాంతికృష్ణకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు


Mon,December 2, 2019 02:39 AM

పర్వతగిరి, నవంబర్‌ 01: గౌరవ డాక్టరేట్‌ పొం దిన ప్రముఖ సామాజిక వేత్త వంగాల శాంతికృష్ణను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. ఆదివారం హన్మకొండలో ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ శాంతికృష్ణ తన ప్రస్ధానం సాగించడం అభినందనీమని మంత్రి దయాకర్‌రావు కొనియాడారు. సేవా రంగంలో మరింత ముందుకు సాగేలా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. తనకు సహకారం అందిస్తున్న ప్రతిఒక్కరికి శాంతికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...