ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేద్దాం..


Mon,December 2, 2019 02:39 AM

-వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 1 : నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట పట్టణ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల మేరకు విడుదల చేశారని, ఈ నిధులతో ఇప్పటికే ఎస్సీ కాలనీలో సీసీరోడ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే పట్టణంలోని అన్ని కాలనీల్లో 100శాతం సీసీరోడ్ల నిర్మాణం కోసం వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. పనుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కార్యకర్తలు, ముఖ్య నాయకులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. త్వరలోనే వర్ధన్నపేట పట్టణంలో డ్రైనేజీని ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతు విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జిల్లా నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, మాజీ జెడ్పీటీసీ సారంగపాణి, నాయకులు చందర్‌రావు, సమ్మయ్య, రఘు, శ్రీధర్‌, పస్తం రాజు, కలింగరావు, రవీందర్‌, గోపాల్‌ తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...