పెల్లుబికిన ప్రజాగ్రహం


Sun,December 1, 2019 05:42 AM

-లైంగికదాడి, హత్యలపై నిరసన జ్వాల
-జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
-కదిలివచ్చిన మహిళలు, ప్రజాసంఘాలు
-కొవ్వొత్తులతో ర్యాలీలు.. ఫ్లకార్డులతో ప్రదర్శనలు
-నిందితులను శిక్షించాలని డిమాండ్
నర్సంపేట, నమస్తే తెలంగాణ : లైంగిక దాడి నిందితులను
ఉరి తీయాలని విద్యార్థినులు, మహిళలు, ప్రజాసంఘాల బాధ్యులు కదం తొక్కారు. ర్యాలీలు నిర్వహించారు. కొవ్వొత్తులతో మృతులకు నివాళులర్పించారు. శంషాబాద్, హన్మకొండ ఘటన నిందితులను వెంటనే ఉరితీయాలని నర్సంపేట కస్తూర్బా మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ ఉషారాణి కోరారు. ఈ మేరకు శనివారం నర్సంపేటలోని వరంగల్ రోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మహిళలకు తగిన విధంగా రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం నర్సంపేట ఏసీపీ ఫణీందర్, సీఐ కరుణసాగర్‌డ్డికి వినతిపవూతాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మహిళలు, యువతలో చైతన్యం తేవడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. నర్సంపేటలోని మహిళా మండలి బాధ్యులు తమకు సహకారం అందించాలని కోరారు. కార్యక్షికమంలో మహిళా మండలి బాధ్యులు చిలువేరు రజనీభారతి, ఎస్‌కే ఖాజాబీ, భారతి, రాధ, శిరీష, రాజేశ్వరి, శైలజ, కనకలక్ష్మి, జానకమ్మ, సరోజన, స్వరూప, పద్మ, సౌందర్య, ఉషారాణి, ఉమ, రత్న, శ్రీదేవి పాల్గొన్నారు.

ఐద్వా ఆధ్వర్యంలో..
నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్యా జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. కార్యక్షికమంలో నాయకులు జమున, ఫాతిమా, భారతి, విజయ, రమ,అపర్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
డీబీఆర్పీ ఆధ్వర్యంలో..
నర్సంపేటలోని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో సమావేశం జరిగింది. డీబీఆర్పీ వ్యవస్థాపకుడు ఇమ్మడి బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. రవి, విజయ్ పాల్గొన్నారు.

మృతులకు నివాళి..
నర్సంపేట : విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
పరకాలలో ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
పరకాల, నమస్తే తెలంగాణ : నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రత్న రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు బొచ్చు కల్యాణ్, నాయకులు మంద రాజ్‌కుమార్, శ్రీధర్‌కుమార్, శివకుమార్, అనిల్, సంతోశ్ పాల్గొన్నారు.

నెక్కొండలో..
నెక్కొండ : నిందితులను తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, ఏబీవీపీ బాధ్యు, విద్యార్థినులు నెక్కొండలో ర్యాలీ నిర్వహించారు. మహిళా సంఘం బాధ్యులు ఈదునూరి కవిత, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
చెన్నారావుపేట : లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా అధ్యక్షుడు జన్ను రమేశ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. శివ, రాజు, కుమార్, లక్ష్మణ్, చిరంజీవి, కార్తీక్, శోభన్, మల్లేశ్ పాల్గొన్నారు.

మరణ శిక్ష విధించాలి : ఎంపీపీ
ఖానాపురం : నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. మహిళా సంఘాల బాధ్యులు శనివారం రాత్రి మండల కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అత్యాచార నిందితులకు వెంటనే మరణశిక్షను అమలుచేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. వేములపల్లి సునీత, ఎంపీటీసీలు మల్యాల కవిత, బోఢ భారతి, మల్యాల పోశెట్టి, రాజశేఖర్, బొప్పిడి పూర్ణచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : బాలికలు డయల్ 100పై అవగాహన కలిగి ఉండాలని మామునూరు ఏసీపీ శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో డయల్ 100పై పోలీసులు అవగాహన కల్పించారు. సీఐ పుల్యాల కిషన్, ఎస్సై వీరేందర్, గురుకుల ప్రిన్సిపాల్ అపర్ణ, ఉపాధ్యాయులు, 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాయంత్రం పోలీసులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...