బాల్యవివాహాలతో అనర్థాలు : ఆర్డీవో రవి


Sun,December 1, 2019 04:44 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : బాల్యవివాహాలతో అనర్థాలు వస్తాయని నర్సంపేట ఆర్డీవో ఎన్ రవి అన్నారు. శనివారం నర్సంపేట డివిజనల్ అధికారి కార్యాలయంలో గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ వరంగల్, స్వయంకృషి సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు నిలిపి వేయండి.. బాల్యవివాహాలు జరిగితే నష్టాలు, బాల్యవివాహాలు జరుగకపోతే వచ్చే లాభాలపై ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో బాల్యవివాహాలను అరికట్టాలని కోరారు. బాల్య వివాహ ప్రయత్నాలు జరిగితే వెంటనే చైల్డ్‌లైన్ 109కు ఫిర్యాదు చేయాలని కోరారు. స్వయంకృషి సంస్థ సెక్రటరీ ప్రభాకర్, గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ జిల్లా మొమిలైజర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...