పదిలో 10/10 టార్గెట్


Thu,November 14, 2019 04:43 AM

- ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి
- స్పెషల్ తరగతులు నిర్వహించండి
- డిసెంబరు 18న ప్రీఫైనల్ పరీక్షలు
- పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ హరిత
- ప్రధానోపాధ్యాయులతో సమావేశం

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ప్ర భుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిత అన్నారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యే క ప్రణాళిక రూపొందించుకోవాలని ఆమె తెలిపారు. బుధవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆమె సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పదో తరగతి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పాఠశాలలో ప్రత్యేక తరగతులు విధిగా నిర్వహించాలని, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి సబ్జెక్టును ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు. వెనుకబడిన విద్యార్థులను సబ్జెక్టుల వారీగా దత్తత తీసుకుని స్పెషల్ క్లాసులు నిర్వహించి ముందంజలో ఉండేలా చర్యలు తీసుకోవాలని హరిత పేర్కొన్నారు. ప్రతి సబ్జెక్టులో పూర్తయిన పాఠాలను మళ్లీ రివిజన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించేలా క్లాసులు తీసుకోవాలని తెలిపారు.

డిసెంబర్ 18వ తేదీన విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని, ప్రతి పాఠశాలలో విధిగా పేరెంట్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని హరిత ఆదేశించారు. ప్రతి విద్యార్థిపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించినపుడే విద్యార్థులు 10 ఫలితాల్లో 10/10 జీపీఏ సాధిస్తారని అన్నారు. ప్రధానంగా ఇంగ్లిష్, సైన్స్, గణితం సబ్జెక్టులపై స్పెషల్ దృష్టి పెట్టాలని, విద్యార్థులకు ఈ సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఉత్తీర్ణత సాధించటం సులభతరమవుతుందని కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్లు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధకుడి (ట్యూటర్) ద్వారా బోధన చేయించాలని అన్నారు.

ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉండేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని హరిత తెలిపారు. పాఠశాలల్లోని సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రధానోపాధ్యాయుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డీ వాసంతి, డీసీఈబీ కార్యదర్శి ఎం.పట్టాభి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...