రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం


Thu,November 14, 2019 04:38 AM

-ముగ్ధుంపురం జయముఖి కళాశాల ఎదుట ఘటన
మృతుడు చెన్నారావుపేట మండలం చంద్రుతండా వాసి
నర్సంపేట రూరల్, నవంబర్13 : రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహన దారుడు మృతి చెందిన సంఘటన ముగ్ధుంపురం జయముఖి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట బుధవారం చోటు చేసుకుంది. చెన్నారావుపేట పోలీసులు, స్థానికుల కథనం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారావుపేట మండలం తిమ్మరాయనిపహాడ్ గ్రామ పంచాయితీ పరిధిలోని చంద్రుతండాకు చెందిన బానోతు ధంజ్యా (40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ధంజ్యా బుధవారం మధ్యాహ్నం పని నిమిత్తం ద్విచక్రవాహనంపై చెన్నారావుపేట మండలం చంద్రుతండా నుంచి నర్సంపేటకు వచ్చాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి వెళ్తున్నాడు.

మార్గమధ్యలో నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారి ముగ్ధుంపురం జయముఖి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట నర్సంపేట నుంచి నెక్కొండకు వెళ్తున్న ఓలారీని ధంజ్యా ఓవర్‌టేక్ చేసి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. అదేలారీ కింద పడిపోయాడు. లారీ వెనుకటైర్లు ధంజ్యా పొట్టపై నుంచి వెళ్లాయి. దీంతో తీవ్రగాయాలైన ధంజ్యాను స్థానికులు గమనించి 108వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ధంజ్యా ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. చెన్నారావుపేట ఇన్‌చారిజ ఎస్సై షాఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద సంఘటన తీరును పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షాఖాన్ తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...