ప్రాణం మీదకు తెచ్చిన భూవివాదం మహేశ్‌చంద్ర మృతిపై పోలీసుల దర్యాప్తు


Thu,November 14, 2019 04:37 AM

-సజీవ దహనం ఘటనపై కేసు నమోదు
దామెర, నవంబర్ 13 : మండలంలోని ముస్త్యాలపల్లిలో మహేశ్‌చంద్ర మృతిపై పోలీసులు పలుకోణాల్ల్లో దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామానికి చెందిన కడారి సమ్మయ్య వద్ద మహేశ్‌చంద్ర తండ్రి ప్రభాకర్ కొన్ని సంవత్సరాల క్రితం 20 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో అసమయంలో గుమస్తాగా మార్కెట్‌లో పని చేస్తున్న మ హేశ్‌చంద్ర కొంత డబ్బును భూమికొనేందుకు తండ్రికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ భూమి తనకే చెందుతుందని పేర్కొనడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో మహేశ్‌చంద్ర భార్య రాధిక కూడా తన కట్నం డబ్బులు అవి అంటూ భర్తతో గొడవకు దిగేది. ఈ క్రమంలో కొంత అప్పు చేసిన మహేశ్‌చంద్ర మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో రాధిక తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లిగారి ఇల్లు నెక్కొండ మండలం పెద్దకొర్పోలుకు వెళ్లింది.

మహేశ్‌చంద్ర మంగళవారం ఇదే భూమి విషయంలో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. తిరిగి రాత్రి మద్యం సేవించి తల్లిని కొట్టేందుకు వస్తుండగా.. తల్లి ఏనుములమ్మ పొయ్యి వద్ద ఉన్న కారంపొడిని మహేశ్‌చంద్రపై చల్లింది. దీంతో కండ్లు తడుముకుంటూ బయటకు వచ్చిన మహేశ్‌చంద్ర తలపై తల్లి కర్రతో బాదగా కుప్పకూలిపోయాడు. వెంటనే పొయ్యివద్ద ఉన్న కిరోసిన్ తీసుకుని కొడుకుపై చల్లిందని సమాచారం. అక్కడే ఉన్న తండ్రి ప్రభాకర్.. ఏనుములమ్మకు జేబులో నుంచి అగ్గిపెట్టె తీసి ఇవ్వగా అగ్గిపుల్లను తీసి గీకి మహేశ్‌చంద్రపై వేసినట్లు తెలుస్తోంది. దీంతో మహేశ్‌చంద్ర అగ్నికి ఆహుతయ్యాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం మహేశ్‌చంద్ర తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. బుధవారం రాత్రి మహేశ్‌చంద్ర అంత్యక్రియలు ముస్త్యాలపల్లిలో జరిగాయి.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...