అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు


Thu,November 14, 2019 04:36 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేట డిపో పరిధిలోని అన్ని రూట్లలో ఆర్టీసీ సర్వీసులను నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కార్మికులు సమ్మెకు దిగి 40 రోజులు పూర్తయినా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించకుండా బస్సులను నడిపిస్తున్నారు. డిపోలో 98 బస్సులు అందుబాటులో ఉండగా బుధవారం 42 ఆర్టీసీ, 18 హైర్ బస్సులను నడిపించారు. వీటికోసం 130 మంది తాత్కాలిక సిబ్బందిని నియమించారు. టీమ్ యంత్రాలతోనే టిక్కెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. డీఎంలు శ్రీనివాసరావు, సదానందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా, పలువురు ఆర్టీసీ కార్మికులు మహబూబాబాద్‌లో మృతి చెందిన కార్మికుడి వద్దకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న సమయంలో కొందరిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగితా కార్మికులు, రాజకీయ నాయకులు అమరవీరుల జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. నర్సంపేట సీఐ కరుణసాగర్‌రెడ్డి, సతీశ్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

పరకాల డిపో పరిధిలో..
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల ఆర్టీసీ డిపో పరిధిలో కార్మికుల సమ్మె చేస్తున్నప్పటికీ బస్సులు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. సమయానుకూలంగా వివిధ రూట్లలో బస్సు సర్వీసులను అధికారులు నడిపిస్తున్నారు. డిపో నోడల్ అధికారి, ఆర్డీవో కిషన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. డిపో మేనేజర్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం 61 బస్సు సర్వీసులను వివి ధ రూట్లలో నడిపించారు. ఇందులో 17 అద్దె బస్సులు ఉన్నాయి. ఇదిలా ఉండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరకు డిపో నుంచి నాలుగు ప్రత్యేక బస్సులను నడిపించారు. ఈ సర్వీసులకు కూడా మంచి ఆదరణ ఉన్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...