ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలి


Thu,November 14, 2019 04:36 AM

చెన్నారావుపేట, నవంబర్13 : గ్రామాలలో శ్మశానవాటిక, డపింగ్ యార్డుల నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని జిల్లా అటవీశాఖాధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ పురుషోత్తం సూచించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ స్పెషలాఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం గ్రామాల వారీగా సమీక్షను నిర్వహించారు. గ్రామాల్లో ఇప్పటి వరకు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణాల కోసం ఎంత మంది ప్రభుత్వ స్థలాలను గుర్తించారని అడిగి తెలుసుకున్నారు.

గుర్తించని వారు శ్మశాన వాటిక కోసం 20 గుంటలు, డంపింగ్ యార్డుకు 10 గుంటల స్థలాన్ని గ్రామ రెవెన్యూ అధికారుల సహాయంతో వెంటనే గుర్తించాలన్నారు. అలాగే, ప్రభుత్వ స్థలం లేని వారు ప్రైవేట్ వ్యక్తుల వద్ద వెంటనే కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. లేకుంటే గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, గ్రామాల్లో గుర్తించిన స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇంటింటికీ ఇంకుడు గుంతలు తప్పకుండా నిర్మించుకోవాలన్నారు. విధులపై ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో కొర్ని చందర్, ఎంపీవో సురేశ్, ఏపీవో అరుణ, ఏవో అనీల్‌కుమార్, సూపరింటెండెంట్ దయాకర్, గ్రామ స్పెషలాఫీసర్లు సత్యనారాయణ, రవీందర్, మంజీలాల్, స్మిత, రఘుపతి, పంచాయతీ కార్యదర్శులు షాహెద్‌పాషా, షకీల్, అశోక్, బాలకిషన్, శ్రీనివాస్, సత్యనారాయణ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రంజిత్‌కుమార్, వికాస్, రాజు, రాజ్‌కుమార్, సాంబరాజు, రవళి, నిట్టు, కవిత, జ్యోతి, మాలతి, మహేశ్, రవి, శ్రావణ్‌కుమార్, శ్యామ్, అవినాశ్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఫజల్, తిరుపతి, మోహన్, కవిత, శ్రీలత, సురేశ్, శ్రీదేవి, వసంత, రాజయ్య పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...