పల్లె ప్రగతికి పంచసూత్రాలు


Tue,November 12, 2019 02:44 AM

-30 రోజుల ప్రణాళికలో ఐదు అంశాలకు ప్రాధాన్యం
- జిల్లాలోని 401 జీపీల్లో నర్సరీలకు స్థలాల గుర్తింపు
- ఊరూరా వైకుంఠధామం, డంపింగ్‌యార్డుకూ స్థల సేకరణ
- ఉపాధి హామీ నిధులతో మూడు నెలల్లోగా నిర్మాణం
- ఈ నెలాఖరులోగా ట్రాక్టర్లు
- జనవరిలోగా ఇంటింటా ఇంకుడుగుంతకు ప్రణాళిక

వరంగల్‌రూరల్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ : ప్రస్తుతం పల్లెల ప్రగతి టార్గెట్. ఈ నేపథ్యంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగిసిన తర్వాత పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తు న్నాం. ప్రధానంగా జిల్లాలో ఐదు అంశాలపై దృష్టి సారించాం. ఊరూరా నర్సరీ, వైకుంఠదామం, డంపింగ్ యార్డు, పంచాయతీకో ట్రాక్టర్, ఇంటింటికి ఇంకుడుగుంత. పచ్చదనం- పరిశుభ్రత కోసం వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం.

లక్ష సాధనకు గడువు నిర్దేశించాం. ఇప్పటికే జిల్లాలో ఉన్న 401గ్రామ పంచాయతీల పరిధిలో నర్సరీల నిర్వహణకు స్థలాలు గుర్తిం చాం. ఆయా నర్సరీ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశాం. 393 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ దామం, డంపింగ్ యార్డు కోసం స్థల సేకరణ జరిగింది. మరో 8 పంచాయతీల్లో స్థల సేకరణ చేయాల్సి ఉంది. మూడు నెలల్లో మొత్తం 401 పంచాయతీల్లో వైకుంఠ దామం, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్లాన్ చేశాం. అలాగే ఈ నెలాఖరులోపు అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలో మొత్తం 1.56 లక్షల ఇండ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ప్రజలు 45 వేల ఇండ్ల వద్ద ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు. ఇంకో 1.11 లక్షల ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉంది. జనవరి నెలాఖరులోగా వీటి నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం.హరిత వెల్లడించారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఇంకుడుగుంత నిర్మాణం కోసం జాబ్ కార్డు లేని అర్హత గల ప్రతి ఒకరికి కొత్తగా జాబ్ కార్డు ఇస్తామని ఆమె ప్రకటించారు. ఉపాధి హామీ నిధుల నుంచి ఒక్కో వైకుంఠ దామం నిర్మాణానికి రూ.10.20 లక్షలు, డంపింగ్ యార్డు నిర్మాణం కోసం రూ.2.60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పల్లెల ప్రగతి కోసం ప్రభుత్వం సెప్టెంబరు 6వ తేదీ నుంచి నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులను కలెక్టర్ హరిత నమస్తేతెలంగాణ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏమన్నారంటే ఆమె మాటల్లో...

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...