మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా వండాలి


Tue,November 12, 2019 02:42 AM

పరకాల, నమస్తే తెలంగాణ : మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా వండాలని పరకాల ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత అన్నారు. పరకాల పట్టణకేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాలను ఎంపీపీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడుతున్న సమయంలో ఎంపీపీ పాఠశాలకు చేరుకుని భోజన నాణ్యతను పరిశీలించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వహణను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరుపట్టికను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన వసతి కల్పించిందని అన్నారు. ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఉపాధ్యాయులు, టీఆర్‌ఎస్ నాయకులు జీవన్ ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...