డిపో సమీపంలో కొండచిలువ ప్రత్యక్షం


Tue,November 12, 2019 02:42 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల ఆర్టీసీ డిపో సమీపంలో ఆరడుగుల కొండచిలువ ఆదివారం రాత్రి ప్రత్యక్షమైంది. డిపో సమీపంలోని పెద్దమోరి వద్ద గల కాలువ నుంచి కొండచిలువ రోడ్డుపైకి వచ్చి అక్కడి నుంచి తాడిచెట్టు ఎక్కింది. స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు అర్ధరాత్రి వరకు శ్రమించి తాడిచెట్టుపైనుంచి కొండచిలువను కిందకు దింపారు. స్థానికుల సహాయంతో కొండచిలువను ఒక డ్రమ్ముల్లో బంధించి సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక వాహనంలో అటవీశాఖ రేంజర్ అడప రమేశ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఝాన్సీ నియోజకవర్గంలోని కాట్రపల్లి ఫారెస్టు బీట్‌లో సురక్షితంగా వదిలిపెట్టారు. కొండచిలువను పట్టుకున్నవారిలో స్థానికులతోపాటు సిబ్బంది నిఖిల్, మహేందర్, నరేశ్ పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...