అన్నదాతల సంక్షేమమే లక్ష్యం


Tue,November 12, 2019 02:42 AM

-వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండాలో వ్యవసాయ బావులు, గృహాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం కోసం ఏర్పాటు చేసిన అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీతండాలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పక్షపాత విధానంతో తెలంగాణ రైతులకు రోజులో 4 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా జరగలేదన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకోగానే రైతులకు ఉచితంగా 24 గంటలు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

తండాలు, గ్రామాలకు కూడా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. అంతేకాక దేవాదుల, ఎస్సారెస్పీల ద్వారా రైతులకు సమృద్ధిగా నీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులను నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని బ్లాక్ కార్యాలయం వద్ద ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయా లను ఎమ్మె ల్యే సందర్శించారు. ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...