ముట్టడిలో ఉద్రిక్తత


Tue,November 12, 2019 02:41 AM

సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో కార్యాలయానికి వచ్చే అన్ని దారుల్లో పోలీసులు పహారా కాశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలో పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు. కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వీరి ర్యాలీకి పార్టీల నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. రోప్ దగ్గరికి వచ్చిన కార్మికులు పోలీసులను నెట్టి వేయడంతో పాటు, మరికొందరు రోప్ కింద నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రధాన గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు గేట్ వేయడంతో కార్మికులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఒక మహిళా కానిస్టేబుల్‌తోపాటు కొందరు మహిళా కార్మికులకు గాయాలయ్యారు. వీరిని ఏరియా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...