అన్ని రూట్లలో నడిచిన ఆర్టీసీ బస్సులు


Tue,November 12, 2019 02:41 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ: నర్సంపేట ఆర్టీసీ డిపో పరిధిలో బస్సులు అన్ని రూట్లలో నడుస్తున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన విధంగా బస్సులు వెళ్తున్నాయి. నర్సంపేట నుంచి హైదరాబాద్, హన్మకొండ, శ్రీశైలం, వరంగల్, నిజామాబాద్, వేములవాడ, కరీంనగర్, తొర్రూర్, మహబూబాబాద్, ములుగు, పరకాల రూట్లలో బస్సులను నడిపిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ అధికారులు శ్రీనివాసరావు, సదానందం బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. నర్సంపేట ఆర్టీసీ డిపో పరిధిలో హైర్ బస్సులతో కలుపుకుని 98 బస్సులు అందుబాటులో ఉన్నాయి. సోమవారం డిపో పరిధిలో 61 బస్సులను నడిపించారు. వీటిలో 44 ఆర్టీసీ, 17 హైర్ బస్సులు ఉన్నాయి. వీటికి 130 మంది తాత్కాలిక కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. అయితే ప్రత్యేక శిక్షణ పొందిన డ్రైవర్లు లేక ఇంద్ర, సూపర్ లగ్జరీ, బస్సులను తిప్పడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 38 రోజులకు చేరింది. జాగ్రత్త చర్యగా బస్సు సర్వీసులను ఎస్కార్ట్ సహాయంతో నడిపించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...