ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి


Mon,November 11, 2019 01:35 AM

శాయంపేట : ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె రమేశ్ అన్నారు. శాయంపేటలో ఆర్‌ఎంపీల వైద్యుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎంపీలు పరిధి దాటి చికిత్స చేయొద్దని అన్నారు. ప్రతి వైద్యుడు తన పేరు ముందు డాక్టర్ అని రాయకూడదని పేర్కొన్నారు. ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే రాసుకోవాలని సూచించారు. సరైన విద్యార్హతలు లేకుండా ల్యాబ్‌లు నిర్వహించవద్దన్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా మెడికల్ షాపులు నడుపొద్దని తెలిపారు. డెలివరీలు గర్భస్రావాలు చేయవద్దన్నారు. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఓరుగంటి రమేశ్, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, రాచర్ల ప్రభాకర్, సహాయ కార్యదర్శి నాగుర్ల సంతోశ్, మండలాల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రామ్‌రెడ్డి, తిరుపతి, రాజన్న, రమేశ్, సంపత్, అక్రమ్, కోశాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...