రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


Mon,November 11, 2019 01:34 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, , నవంబర్ 10: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి దుర్గారావు(52) ఆదివారం వరంగల్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో ఉప్పరపల్లి గ్రామ సమీపంలో రహదారిపై ఉన్న గుంతలో వాహనం పడడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో దుర్గారావు తలకు బలమైన గాయమై తీవ్రంగా రక్తస్రావం జరిగి మృతి చెందాడు. ప్రయాణికులు, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలువురు మృతి చెందిన వ్యక్తి దుర్గారావుగా గుర్తించి పోలీసులు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వర్ధన్నపేట ఎస్సై సంపత్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా స్థానిక జెడ్పీటీసీ మార్గం భిక్షపతి దుర్గారావు మృతి చెందిన విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకుని అతని సమీప బంధువులకు సమాచారం ఇవ్వడంతో పాటుగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...