వారోత్సవాలను విజయవంతం చేయాలి


Mon,November 11, 2019 01:34 AM

బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. బాలల హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులతో కలిసి వాకథాన్ నిర్వహణ, ప్లకార్డులతో ర్యాలీలు, విద్యార్థులతో బెలూన్లు, పతంగుల ఏగురవేత చేపడుతున్నాం. వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట ఐసీడీఎస్ పరిధిలో ఎంపిక చేసిన మూడు కేజీబీవీ, మహాత్మాజ్యోతిబా ఫూలే, ప్రభుత్వ పాఠశాలల్లో బాలలకు ఎనిమిది రకాల ఆటల పోటీలు నిర్వహిస్తాం. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు ఉంటాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లో మాక్ అసెంబ్లీని విద్యార్థులతో ఏర్పాటు చేస్తాం. పావురాలను ఎగురవేయడం, పిల్లలందరికీ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా రక్షా బంధన్ నిర్వహిస్తాం. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 60 మంది బాలలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపికను ఈ నెల 20న అందిస్తాం. జిల్లాలో ఈ నెల 7 నుంచి 20 వరకు బాలల వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. అలాగే, ప్రత్యేకమైన పోస్టర్లు, బాలల హక్కులు, రక్షణ చట్టాలు, కరదీపిక, బుక్‌లెట్లను ప్రతి పాఠశాలకు అందిస్తాం. కార్యక్రమాలను అందరూ విజయవంతం చేయాలి. - మహేందర్‌రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...