ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు


Mon,November 11, 2019 01:34 AM

నర్సంపేట,నమస్తే తెలంగాణ: నర్సంపేట డిపో పరిధిలోని అన్నీ రూట్లలో ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించారు. డిపో పరిధిలో మొత్తం 98 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులను పంపించారు. ఆదివారం డిపో పరిధిలో 43 ఆర్టీసీ, 18 హైర్ కలిపి మొత్తం 61 బస్సులను నడిపించినట్లు ఆర్టీసీ అధికారులు శ్రీనివాసరావు, సదానందం తెలిపారు. ఈ మేరకు 132 మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించినట్లు పేర్కొన్నారు.

అంతేకాక టీమ్ సర్వీసులతో ప్రయాణికులకు టికెట్లను కూడా అందిస్తున్నారు. హైదరాబాద్, శ్రీశైలం, నిజామాబాద్, వేములవాడ, కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, తొర్రూరు, ములుగు, ఏటూరునాగారం, పరకాల, నల్లబెల్లి రూట్లలో బస్సులు యథావిధిగా నడిచాయి. కాగా, సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు వామపక్షనాయకులతో కలిసి నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్, వరంగల్ కూడలిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ కరుణాసాగర్‌రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...