నేటినుంచి బీట్ అధికారులకు శిక్షణ


Mon,November 11, 2019 01:34 AM

-పాకాలలో ఆరు రోజుల పాటు నిర్వహణ
ఖానాపురం, నవంబర్ 10 : పాకాలలో నేటి నుంచి బీట్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు అటవీ అధికారులు పాకాలలో శిక్షణా, భోజన, వసతి ఏర్పాట్లును పూర్తి చేశారు. ఇటీవల ఉద్యోగానికి ఎంపికైన వరంగల్ రూరల్, మహబుబాబాద్ జిల్లాలకు చెందిన నర్సంపేట, కొత్తగూడ, గంగారం, గూడూరు, మహబుబాబాద్, బయ్యారం, తొర్రూరు, డోర్నకల్ అటవీ రేంజ్ పరిధిలోని 35 మంది బీట్ అధికారులకు ఆరు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నారు. వీరికి మహబుబాబాద్ డీఎఫ్‌వో కిష్టాగౌడ్, ఎఫ్‌డీవో కృష్ణమాచారి, రిటైర్డ్ డీఎఫ్‌వో జీ శ్రీనివాసరావులు, తరగతులను నిర్వహించనున్నారు. వీరికి పాకాల పర్యావరణ అధ్యయన కేంద్రంలో తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, శిక్షణా ఏర్పాట్లను రూరల్ డీఎఫ్‌వో పురుషోత్తం ఆధ్వర్యంలో నర్సంపేట, కొత్తగూడ ఎఫ్‌ఆర్వోలు రమేశ్, లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. శిక్షణా కార్యక్రమం ప్రారంభానికి సీఎఫ్‌వో అక్బర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...