అన్ని రూట్లో నడిచిన ఆర్టీసీ సర్వీసులు


Sun,November 10, 2019 01:56 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ: నర్సంపేట డిపో పరిధిలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపించారు. డిపో పరిధిలో 98 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పల్లెకు కూడా బస్సులను నడిపించారు. పల్లె వెలుగులతో సర్వీసులను విరివిగా తిప్పుతున్నారు. డిపో పరిధిలో గతంలో నడిచే సర్వీసులనే కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, శ్రీశైలం, నిజామాబాద్, వేములవాడ, కరీంనగర్, గోదావరి ఖని, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, తొర్రూర్, ములుగు, ఏటూరునాగారం, పరకాల, నల్లబెల్లి రూట్లలో బస్సులను నడిపించారు. శనివారం నర్సంపేట ఆర్టీసీ డిపో పరిధిలో 44 ఆర్టీసీ, 18 హైర్ మొత్తం 62 బస్సులు నడిపించారు. సర్వీసులను ఆర్టీసీ అధికారులు శ్రీనివాసరావు, సదానందం పర్యవేక్షించారు. ఈ మేరకు 140 మంది తాత్కాలిక సిబ్బందిని నియమించారు. టీమ్ సర్వీసులతో ప్రయాణికులకు టిక్కెట్లు అందిస్తున్నారు. అధికారుల సూచనల ప్రకా రం తాత్కాలిక కండక్టర్లు డ్యూటీలు చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ ఉండడంతో పలువురు కార్మికులను పోలీసులు ముందుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరి కొందరు కార్మికులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. హైదరాబాద్‌లోనూ పలువురు నర్సంపేట కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. నర్సంపేటలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐలు కరుణసాగర్‌రెడ్డి, సతీశ్‌బాబు, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.

పరకాలలో 84 శాతం నడిచిన ఆర్టీసీ బస్సులు
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల ఆర్టీసీ డిపో నుంచి శనివారం 84.78శాతం బస్సులు నడిచాయి. డిపోలో 92 బస్సులు ఉండగా ఇందులో 19 అద్దె బస్సులు, 73 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. దసరా నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి, నిరసన తెలుపుతుండగా అధికారులు మాత్రం ప్రయాణికులను ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. శనివారం 59 ఆర్టీసీ, 19 అద్దె బస్సులు కలిపి మొత్తం 78 బస్సులను వివిధ రూట్లలో నడిపించారు. రోజురోజుకు సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. డిపో వద్ద పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి నోడల్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తూ ఆర్టీసీ సేవలు ప్రయాణికులకు మెరుగ్గా అందించేందుకు కృషి చేస్తున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...