గురుకులాల్లోనే కార్పొరేట్ స్థాయి విద్య


Sun,November 10, 2019 01:55 AM

-ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్
దుగ్గొండి, నవంబర్09 : గురుకులాల్లోనే కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తుందని మండలంలోని గిర్నిబావి మహత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ అన్నారు. శనివారం గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లింద్రులతో టీ విత్ ప్రిన్సిపాల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యారులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకోనేలా ప్రోత్సహించాలన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యాసేవలు, వసతుల గురించి వివరించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో మాదిరిగా గురుకులంలోని ప్రతి విద్యార్థి రూ.80 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మానస, శ్రీదేవి, కోటి, శ్రీనివాస్, పీఈటీ బాబు, రమేశ్, ప్రేమలత, రోజా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...