24న టీఎస్‌ఆర్‌ఎస్ పూర్వ విద్యార్థుల అలూమ్ని


Sun,November 10, 2019 01:55 AM

హసన్‌పర్తి, నవంబర్ 09 : వరంగల్ అర్బన్ జిల్లా ఎర్రగట్టుగుట్ట క్రాస్‌రోడ్డులోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల ఏర్పడి 36 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 24న అలూమ్ని ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థి ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ బాలికల గురుకుల విద్యాలయం హసన్‌పర్తి యాజమాన్యం, పూర్వ విద్యార్థి ప్రతినిధులు సమావేశమై శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. నవంబర్ 24న జరగబోయే ఉత్సవాలకు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు. 36 సంవత్సరాలుగా తెలంగాణ బాలికల గురుకుల విద్యాలయం ఎర్రగట్టుగుట్ట హసన్‌పర్తిలో చదివిన విద్యార్థులందరూ కూడా ఒకరికొకరు సమాచారం చేరవేసుకొని ఆ రోజు టీఎస్‌ఆర్‌ఎస్ (ఏపీఆర్‌ఎస్) హసన్‌పర్తి గురుకుల విద్యాలయంలో జరిగే వేడుకలకు సకాలంలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యాయులు భారతి, మధునా, ఏటీపీ రాజకుమారి పూర్వ విద్యార్థి ప్రతినిధులు రచయిత్రి అరుణ కీర్తి పతాక, సిరికొండ శ్రీలత, కవిత తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...