గ్రంథాలయ భవనాన్ని వేగంగా నిర్మించాలి


Sat,November 9, 2019 04:30 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేటలో గ్రంథాలయ భవనాన్ని వేగవంతంగా నిర్మించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్ అన్నారు. శుక్రవారం నర్సంపేట గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నర్సంపేటలో గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని అన్నారు. నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ నిధులతో నిర్మిస్తున్న పనులను వేగవంతం చేయాలని కోరారు. భవనం పూర్తయ్యే వరకు పాఠకులకు అందుబాటులో ఉండే విధంగా ఒక భవనాన్ని తీసుకుని అందులో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 14 నుంచి జరుగబోయే గ్రంథాలయ వారోత్సవాల్లో నర్సంపేటలోని ప్రభుత్వ ,ప్రైవేట్‌పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు గంప రాజేశ్వర్‌గౌడ్, పసుల రమేశ్, దప్పటి సదయ్య, మంద విజేందర్, బొచ్చు సుమన్, బొచ్చు తిరుపతి, ఆనందం పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...