వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం


Sat,November 9, 2019 04:30 AM

-జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి
పరకాల, నమస్తే తెలంగాణ : రూరల్ జిల్లా లో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జేసీ తన ఛాంబర్‌లో జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో తగిన ఏర్పాటు చేసుకోవాలని, అన్ని సౌ కర్యాలు కల్పించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పీపీసీ కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుతం 103 పీపీసీ కేంద్రాలు అయినట్లు తెలిపారు. అదనంగా మరో ఆరు కొత్త సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రైతులకు ఎత్తి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగకుండా పీపీసీ సెంటర్లు చూసుకోవాలన్నారు. సెంటర్లలో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, డీఆర్‌వో హరిసింగ్, జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజ్, మార్కెటింగ్ అధికారి, లీగల్ మెట్రాలజీ అధికారి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...