మారథాన్‌లో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్‌కు మెడల్ ప్రదానం


Fri,November 8, 2019 03:28 AM

శాయంపేట, నవంబర్ 07 : అమెరికా మా రథాన్‌లో విజయవంతంగా పాల్గొన్న వరంగ ల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి మారథాన్ మెడల్ అం దుకున్నారు. వరుసగా మూడు మారథాన్ పరు గు పోటీల్లో పాల్గొని విజయవంతంగా లక్ష్యం చే రినందుకు గురువారం అక్కడ జరిగిన కార్యక్రమంలో మెడల్‌ను ప్రదా నం చేశారు. ఇటీవల అ మెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఆమె 5.20 గంటల్లో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే కొద్ది రోజుల క్రితం అమెరికాలోని బోస్టన్‌లో మరో మారథాన్‌లోను ఆమె పాల్గొన్నారు. గతంలో చికాగోలో జరిగిన మారథాన్‌లో రాణించారు. ఇలా వరుసగా మూడుసార్లు మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు ఇండియా నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతికి 2019 టీసీఎస్ న్యూయార్క్ సిటీ మారథాన్ (న్యూయార్క్ రోడ్ రన్నర్) మెడల్‌ను అందుకున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...