మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి


Fri,November 8, 2019 03:28 AM

వరంగల్, నమస్తేతెలంగాణ : రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా రెండోసారి కుడా చైర్మన్‌గా నియమితులైన మర్రిని మంత్రి కేటీఆర్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుడా అభివృద్ధ్దికి కృషి చేయాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు వంటి ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో రైతు రుణ విమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...