రేపు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం


Fri,November 8, 2019 03:28 AM

పర్వతగిరి, నవంబర్ 07 : ఎస్‌జీఎప్‌ఐ 65వ రాష్ట్రస్థ్ధాయి పాఠశాల కళాశాలల నెట్ బాల్ ఆర్చరీ, ఉష్, త్రోబాల్ పోటీలు ఈ నెల 9న కల్లెడలోని కళాశాలలో ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ సింగారపు యాకయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 9 నుంచి 14 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఆర్‌డీఎఫ్ వనితా అచ్యుతపాయ్ విద్యాలయ క్రీడా ప్రాం గణంలో నిర్వహిస్తున్న పోటీలకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు వంద మంది అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఈ పోటీలను ఎమ్మెల్యే అరూరి రమేశ్ పారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రంలో ఆర్డీఎప్ వ్యవస్థాపకుడు ఈ రామ్మోహన్, ఉమ్మడి జిల్లా క్రీడా కార్యదర్శి జీ ఇమ్మయ్య, పీ సుధాకర్, క్రీడా కన్వీనర్ ఐలయ్య, కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాల హెచ్‌ఎం శ్రీధర్, అశోకాచారి తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...