అభివృద్ధిలో భాగస్వాములు కావాలి


Fri,November 8, 2019 03:28 AM

గీసుగొండ, నవంబరు 07: గ్రామాల అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని ఎన్‌ఐఆర్డీ కోఆర్డినేటర్ మధుసూదన్ తెలిపారు. మండలంలోని గంగదేవిపల్లి కోనాయమాకుల గ్రామాల్లో గురువారం ఎన్‌ఐఆర్డీ (జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ) బృందం సభ్యులు సందర్శించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో స్వయసహాయక బృందాల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులకు, బాలింతలకు అందించే పౌష్టికాహారం వివరాలను తెలుసుకున్నారు. బాలామృతం ప్యాకెట్ల పంపిణీ తదితర అంశాలపై అంగన్‌వాడీ సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. గ్రామంలో ఈజీఎస్ పనులను ఇంకుడు గుంతలు, ప్రతి ఇంటిలో నిర్మించకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గోలి రాదాబాయి, గోనె మల్లారెడ్డి, ఏపీఎం సురేశ్, సీసీలు సుజాత, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...