పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు


Thu,November 7, 2019 01:51 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా సరైన గుర్తింపు లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. టీఆర్‌ఎస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడిగా ఎన్నికైన తూళ్ల కుమారస్వా మి, ప్రధాన కార్యదర్శి కమ్మగోని స్వామిరాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే రమేశ్‌ను బుధవారం హన్మకొండలోని ఆయన స్వగృహంలో కలిసి పుష్పగు చ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆవిర్భావించిన టీఆర్‌ఎస్ క్రమంగా రాజకీయ పార్టీగా ఏర్పడి ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధానంగా పార్టీని నమ్ముకొని పనిచేసే కార్యకర్తలను తప్పకుండా గుర్తించి వారికి అవకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పేద కుటుంబాలకు చెందిన కార్యకర్తలకు కూడా అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. అలాగే పార్టీలో పనిచేసే కార్యకర్తలకు కూడా ఎలాంటి బేషజాలు లేకుండా పార్టీ బాధ్యతలను ఇస్తున్నట్లు తెలిపారు. నాయకులు కూడా పార్టీ కోసం అందరు కార్యకర్తలను కలుపుకుంటూ వెళుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ఎలాంటి సమస్యలున్నా అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలే తప్ప పార్టీ నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దన్నారు. పార్టీకి నష్టం కలిగించేవారిని ఏమాత్రం సహించేది లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలని సూచించారు. అలాగే, నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, అర్బన్ జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెలి శ్రీరాములు, నాయకులు గుజ్జ సంపత్‌రెడ్డి, ఇల్లందుల సుదర్శన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...